Thursday, April 18, 2024

TS: కు.ని. ఆపరేషన్​ మరణాలకు బాధ్యులుగా వారిని సస్పెండ్​ చేయాలి: బండి సంజయ్​

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లో నలుగురు మహిళలు చనిపోవడానికి తెలంగాణ ఆరోగ్య మంత్రి టి హరీశ్‌రావు, ప్రభుత్వ డైరెక్టర్ (డిపిహెచ్) జి. శ్రీనివాసరావు కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వైద్య శాఖ డైరెక్టర్‌ తో పాటు ఆరోగ్య మంత్రిని తక్షణమే బర్తరఫ్‌ చేసి సస్పెండ్‌ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ను సంజయ్‌ ఇవ్వాల (మంగళవారం) డిమాండ్‌ చేశారు. ఉత్త ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, సీఎం కేసీఆర్​ దీన్ని సీరియస్​గా తీసుకుంటే​ సస్పెన్షన్‌ వేటు వేయాలని బండి కోరారు.

తెలంగాణలో పేదరికం కారణంగా ఆత్మహత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మరణాలు కూడా సాధారణ స్థితికి చేరుకున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స బాధితులందరూ పేదలు మాత్రేమేనన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ను ఇదే అంశంపై విచారణ అధికారిగా నియమించడం దొంగకు తాళాలు ఇవ్వడం లాంటిది కాదా? అని బండి ప్రశ్నించారు.

ఏం చేసినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం తమకు భవిష్యత్తులో ఎమ్మెల్సీలుగా నియమిస్తుందన్న విశ్వాసం అధికారుల్లో బలంగా ఉందని బీజేపీ చీఫ్ వాదించారు. శస్త్రచికిత్స శిబిరంలో ఒక్క మహిళా డాక్టర్ కూడా లేరని పేర్కొన్నారు. బాధితులకు కనీసం మహిళా వైద్యులు పరీక్షలు నిర్వహించలేదు.”ఆరోగ్య మంత్రి హరీశ్ రావు బాధ్యత వహించాలి కదా? అని ప్రశ్నించారు సంజయ్​.

Advertisement

తాజా వార్తలు

Advertisement