Friday, March 29, 2024

ఆ మెస్సేజులు నిజం కాదు, వాటిని పట్టించుకోవద్దు.. ఎస్​బీఐ కస్టమర్లకు అలర్ట్​

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. మీ ఎస్‌బీఐ ఖాతా బ్లాక్‌ చేశారని మరో ఫేక్‌ మెసేజ్‌ తాజాగా సర్య్యూలేట్‌ అవుతోందని ఈ నకిలీ ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్‌లకు ఎట్టిపరిస్థితుల్లోనూ స్పందించవద్దని సూచించింది. ఈ మేరకు వ్యక్తిగత, బ్యాంకింగ్‌ వివరాలను వేరేవాళ్లతో పంచుకోవద్దని వెల్లడించింది. ఒకవేళ అటువంటి సందేశాలు మీకు వస్తే [email protected]కు నివేదించాలని కోరింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ తన అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌లో ఈ హెచ్చరికను షేర్‌ చేసింది. ఈ నేపథ్యంలోనే ఖాతాదారులెవరూ నకిలీ సందేశాలతో వచ్చే లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని ఎస్‌బీఐ అప్రమత్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement