Sunday, December 8, 2024

ఈ వ్యాక్సిన్ ని.. నీళ్ల‌లో క‌లిపి తాగొచ్చు

కొత్త త‌ర‌హా క‌రోనా వ్యాక్సిన్ ని అమెరికా శాస్త్ర‌వేత్త‌లు అభివృద్ధి చేశారు. ఇంజెక్ష‌న్ అంటే భ‌యం ఉన్న‌వారికోసం నీళ్ల‌లో క‌లిపి తాగే విధంగా ఈ వ్యాక్సిన్ ని త‌యారు చేశారు. యూఎస్‌ స్పెషాలిటీ ఫార్ములేషన్స్‌ అనే సంస్థ ‘క్యూవైఎన్‌డీఆర్‌(కిండర్‌)’ పేరుతో ఈ వ్యాక్సిన్‌ను తయారుచేసింది. న్యూజిలాండ్‌లో జరిగిన ఈ వ్యాక్సిన్‌ ఫేజ్‌ -1 ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు వచ్చాయని, ప్రస్తుత కరోనా వేరియంట్లపై ఇది సమర్థంగా పని చేస్తున్నదని సంస్థ వ్యవస్థాపకులు క్వైల్‌ తెలిపారు. తదుపరి దశల ట్రయల్స్‌ చేయడానికి ఈ సంస్థ నిధుల కోసం ప్రయత్నిస్తుంది. అన్ని స్థాయిల్లో ట్రయల్స్‌ పూర్తయ్యాక ఈ వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి విడుద‌ల‌కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement