Friday, March 29, 2024

ఇదేంద‌య్యా ఇది.. బైక్ పై.. భార్య‌.. ఐదుగురు పిల్ల‌ల‌తో పాటు రెండు కుక్క‌లు

బైక్ పై ఎంత‌మంది వెళ్లొచ్చు మ‌హా అయితే ముగ్గురు మ‌రీ అయితే న‌లుగురు అనుకుందాం.. కానీ ఇక్క‌డ ఒక బైక్ పై త‌న భార్య, ఐదుగురు పిల్లలతో పాటు రెండు పెంపుడు కుక్కలు, లగేజీని తగిలించుకుని దర్జాగా పోతుండడం చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. వీరిలో ఎవ‌రూ కూడా హెల్మెట్ ధరించలేదు. పైగా వాహనం కూడా 40 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. ఈ వీడియో పాత‌దే అయినా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పోలీసులకు పట్టుబడితే, చలాన్లు కట్టేందుకు ఈ వ్యక్తి రుణం తీసుకోక తప్పదంటూ ఓ నెటిజన్ హాస్యంగా కామెంట్ చేశాడు. మరో యూజర్ అయితే.. ‘చలాన్లు ఏమీ ఉండవు. వీరిని ఆపిన వారు, అసలు ఇంత మంది ఎలా సర్దుకున్నారంటూ గమనించాల్సి వస్తుంది’ అని కామెంట్ పెట్టాడు. ఈ వీడియోను ఇప్పటికే రెండున్నర లక్షల మందికి పైగా చూశారు. మ‌రి మీరు ఓ లుక్క్ వేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement