Saturday, April 20, 2024

ఇదో కొత్తరకం కల్తీ కథ, బ్రేక్ చేసిన పోలీసులు.. మిర్చి తొడిమేలతో పౌడర్, వ్యాపారి అరెస్ట్

వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్) : వరంగల్ నుండి మహారాష్ట్రకు లారీలోడ్ తో బయలు దేరడానికి సిద్ధంగా ఉన్న మిర్చి తొడిమేల పౌడర్ ను వరంగల్ టాస్క్ ఫోర్స్ , ఫుడ్ సేఫ్టీ అదికారులు సంయుక్తంగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. వరంగల్ నగరంలోని ఏనుమాముల లోని మల్లేశ్వర కోల్డ్ స్టోరేజ్ నుండి మిర్చి తొడిమలను పట్టించి పౌడర్ గా చేసిన 10 లక్షల విలువ జేసీ స్టాక్ రవాణాకు సిద్ధంగా ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ ఆర్.సంతోష్ కు పక్కా సమాచారం అందుకున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ సంతోష్ నేతృత్వంలో ఆకస్మిక దాడి చేసి, లారీ లోడ్ ను (అశోక లేలాండ్, ఎం హెచ్ 12 ఎల్ టి 4706)సీజ్ చేశారు.

- Advertisement -

మల్లేశ్వర కోల్డ్ స్టోరేజ్ యజమాని హన్మకొండ ,కాకతీయ కాలనీకి చెందిన కంభంపాటి శ్రీధర్ ని అరెస్ట్ చేశారు. ధనియాల పౌడర్, తదితర ఉత్పత్తులతో కల్తీ చేసి, అక్రమార్జనకు అలవాటు పడ్డ వ్యాపారులు వరంగల్, గుంటూరు ప్రాంతాల నుండి మహారాష్ట్ర వ్యాపారులు దిగుమతి చెడుకొంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈసారి మిర్చి ధరలు పైపైకి పోవడంతో మిర్చి తొడిమేల పొడికి మిర్చి పౌడర్ గా మార్చే రసాయనాలు కలిపి చిల్లీ పౌడర్ గా అమ్మే ఎత్తులు వేసిన్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసుల విచారణలో బయట పడింది.

వరంగల్ లో తాలు మిర్చి కాయలు కొనుగోలు చేసి, తొడిమేలతో కలిపి పౌడర్ గా పట్టించి, ఎర్రటి మిర్చి రంగు వచ్చే విధంగా రసాయనాలు కలిపి అక్రమ దందా సాగించే వారని పోలీసులు తెలిపారు. కానీ ఇప్పుడు మిర్చి తొడిమలనే పొడి చేసి, ధర ఎక్కువగా ఉన్న ఉత్పత్తుల్లో మిక్సింగ్ చేసి, వినియోగదారులను మోసం చేస్తున్నట్టు పోలీసుల విచారణలో గుర్తించారు. ఆహార కల్తీకి పాల్పడుతున్న మిర్చి తొడిమల నిల్వలను ఆహార నియంత్రణ అధికారులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement