Wednesday, April 17, 2024

వీళ్ల దుంపతెగ.. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదురుగానే ‘దుకాణం’ పెట్టేశారు..

చాటుమాటుగా ఉంటేనే సరసం.. అన్నారు పెద్దలు.. కానీ, వీళ్లు మాత్రం ఏకంగా పోలీసు స్టేషన్ ఎదురుగానే దుకాణమే తెరిచారు. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ తతంగాన్ని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు. నేరుగా రంగంలోకి దిగిన ఎస్పీ ఈ పాడు పనిచేస్తున్న వారిని అడ్డంగా బుక్ చేశాడు. సినిమాను తలపించేలా ఉన్న ఈ కేసు వివరాలు చదివి తెలుసుకోండి..

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌ పడవా పోలీస్ స్టేషన్‌ ముందు పాఠఖ్ పేరుతో ఓ గెస్ట్ హౌస్ ఉంది. అయితే ఈ గెస్ట్ హౌస్ లో అట్లాంటి పనులు జరుగుతున్నాయని ఈ మధ్య కాలంలో పోలీసులకు కంప్లెయింట్స్ వస్తున్నాయి. పైకి చిన్న చిన్న ఫంక్షన్లు జరుగుతాయని చెబుతున్నా.. లోపల మాత్రం వేరే సీన్ ఉంటుందనేది స్థానికుల అభిప్రాయం. దీంతో ఈ చీకటి కోణం సంగతి తెల్చేందుకు ఎస్పీనే నేరుగా రంగంలోకి దిగారు. ముందుగా మఫ్టీలో ఉన్న ఓ పోలీసును ఆ గెస్ట్ హౌస్ లోకి పంపించారు. తనకు అమ్మాయిలు కావాలని ఆ పోలీస్ చెప్పాడు. ఇక్కడ అలాంటివి జరగవని మేనేజర్ సమాధానం ఇచ్చాడు.

తాను చాలా దూరం నుండి వచ్చానని, ఇక్కడ ఇదంతా మాములే అట కదా అని చెప్పడంతో మేనేజన్ లోపలికి వెళ్లి అమ్మాయిల ఫొటోలను తీసుకువచ్చాడు. అమ్మాయిల వయసు, అందాన్ని బట్టి రేట్లు చెప్పాడు. ఇక తాము అనుమానించిందే నిజమైందని భావించిన ఆ పోలీసు బయట ఉన్న సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో లోపలికి ప్రవేశించిన పోలీసులు మేనేజర్ తో పాటు ఈ రొంపిలోకి దిగిన మహిళలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement