Friday, April 26, 2024

ది వారియ‌ర్ టీజ‌ర్ కి భారీ రెస్పాన్స్ – 10మిలియ‌న్ల వ్యూస్

యాక్ష‌న్ డ్రామా చిత్రంగా ప్రేక్ష‌కుల ముంద‌కు వ‌స్తోంది ది వారియ‌ర్ చిత్రం.ఈ చిత్రంలో హీరో రామ్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ కూడా సినిమాలో బోలెడంత మాస్ కంటెంట్ ను ఉన్నట్టు చూపిస్తున్నాయి. కాగా రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్భంగా నిన్న టీజర్ ను వదిలారు. ఈ టీజర్ ఊహించని విధంగా యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
ది వారియర్ టీజర్ కు ప్రస్తుతం ఆడియెన్స్ నుంచి గట్టి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, తమిళ భాషలో రిలీజ్ అయిన ఈ టీజర్ భారీ స్థాయిలో వ్యూయర్ షిప్ ను దక్కించుకుంటోంది. ఇంకా 24 గంటలు పూర్తికాక ముందే 10 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోందీ టీజర్. ఊరమాస్ విజువల్స్ తో టీజర్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. రామ్ పోతినేని చెప్పే ఒక్కో డైలాగ్ సినిమాపై భారీ హైప్ ను పెంచుతున్నారు. మొత్తంగా ‘ది వారియర్’తో కొత్తదనం చూపించారు హీరో రామ్. . జులై 14న వరల్డ్ వైడ్ ‘ది వారియర్’ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement