Saturday, April 20, 2024

జల్సాల కోసం చోరీలు – అంతర్ జిల్లా మోటార్ సైకిళ్ళ దొంగలు అరెస్ట్

యువకులు జల్సాలకు అలవాటు పడి చెడు మార్గం ఎంచుకొని భవిష్యత్తును చీకటి మయం చెసుకోవద్ద‌ని పెద్దపల్లి డి సి పి పి రవీందర్ అన్నారు. ఎన్ టి పి సి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన పాత్రీకేయుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.. డి సి పి. అరునియ రవి ,M. రవి, బయ్యపు దామోదర్ రెడ్డి , గత నెల రోజుల నుండి ఎన్ టి పి సి పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ లు చోరికి గురి అవుతుండడంతో , ఉన్నత, అధికారుల ఆదేశాల మేరకు , ఎన్ టి పి సి పోలీసులు వాహనాల తనిఖి నిర్వహిస్తుండగా నిందితులు అరునియ రవి ,రవి లు మోటార్ సైకిల్స్ పై వస్తూ పోలీస్ వారిని చూసి అనుమానాస్పదంగా పారిపోతుండగా , వారిని చాకచక్యంగా ప‌ట్టుకున్నారు పోలీసులు . వాహ‌నాల‌ను అమ్మ‌గా వచ్చిన డబ్బులతో జల్సాలకు పాలపడ్తున్నట్లు విచారణ లో తెలిసింది . ఇట్టి నిందితులను దర్యాప్తు అనంతరం కోర్ట్ లో రిమాండ్ నిమితం హాజరు పరుస్తామ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement