Tuesday, April 23, 2024

Spl Story: ప్రపంచ వ్యాప్తంగా గుజరాత్​ ఘటనే అతిపెద్ద ప్రమాదం.. 141 మందిని మింగిన బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం

గుజరాత్ లో కేబుల్​ బ్రిడ్జి కూలిన ఘటనలో 141 మంది ప్రాణాలు కోల్పోయారు.. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన కొన్ని ప్రమాద ఘటనలను పరిశీలిస్తే గుజరాత్​లో జరిగిన కేబుల్​ బ్రిడ్జి ఘటనే అతిపెద్దదిగా తెలుస్తోంది. ఈ పురాతన బ్రిడ్జిని మూసేసినప్పటికీ, ఓ ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు అప్పజెప్పింది. ప్రభుత్వం. దాని రిపేర్లు సరిగా చేయకుండానే మళ్లీ ఈ మధ్య రీ ఓపెన్​ చేసినట్టు తెలుస్తోంది. కాగా, నిన్న ఆదివారం కావడం, ఛట్​పూజ మహోత్సవాలు జరుపుకోవడం వంటి సంబురాల్లో ప్రజలు ఉన్నారు. కేబుల్​ బ్రిడ్జిని చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చారు. ఒక్కసారిగా బ్రిడ్జి కూలడంతో వందలాది మంది గల్లంతయ్యారు. ఇంకా చాలామంది అడ్రస్​ లభించడం లేదు. ఇది ముమ్మాటికీ బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగానే జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇట్లాంటి దారుణ ప్రమాదాలు గతంలోనూ జరిగాయి. గడిచిన 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద ప్రమాదాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ


1) 2021లో మెక్సికోలో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న సిటీ మెట్రో స్టేషన్ లో కొంతభాగం కూలిపోయింది. దీంతో ఓ ప్యాసింజర్ రైలు కూలి, 26మంది ప్రయాణికులు చనిపోయారు.

2) 2018లో ఇటలీలోని జెనోవా నగరంలో కీలకమైన వంతెన కుప్పకూలింది. ఫ్రాన్స్ ను ఇటలీని కలిపే ఈ హైవేపైన నిర్మించిన ఈ వంతెన కూలిపోవడంతో వాహనాలు కిందపడ్డాయి. ఈ ప్రమాదంలో 43 మంది చనిపోయారు.

3) 2016లో కోల్ కతాలో నిత్యం బిజీగా ఉండే ఫ్లైఓవర్ కూలిపోవడంతో 26 మంది చనిపోయారు. కాంక్రీట్ శ్లాబుల కింద చిక్కుకున్న దాదాపు వందమందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు.

4) 2011లో డార్జిలింగ్ సమీపంలోని ఓ వంతెన కూలిపోయింది. నదిపై నిర్మించిన ఈ వంతెనపై జనం కిక్కిరిసిపోవడంతో అకస్మాత్తుగా కూలింది. దీంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.


5) 2007లో చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కుప్పకూలి 64 మంది వర్కర్లు చనిపోయారు. అదే ఏడాది నేపాల్ లో జరిగిన ప్రమాదంలో 16 మంది చనిపోయారు. భేరీ నదిపై కట్టిన వంతెన కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై సుమారు 400 మంది దాకా ఉంటారని అధికారుల అంచనా. బ్రిడ్జి కూలడంతో నదిలో పడ్డ సుమారు 100 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.

6) 2006లో పాకిస్థాన్ లో భారీ వర్షాలకు మార్దాన్ లోని ఓ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది డిసెంబర్ లో బీహార్ లోని పురాతన బ్రిడ్జి ఒకటి కూలి ప్యాసెంజర్ ట్రైన్ కు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 34 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు.

7) 2003 ఆగస్టులో ముంబైలో వంతెన కూలి నదిలో పడడంతో 20 మంది చనిపోయారు. ఇందులో 19 మంది చిన్న పిల్లలే కావడం విషాదకరం. వంతెన పై నుంచి స్కూలు బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డిసెంబర్ లో బొలీవియాలో వరదలకు ఓ బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఆ సమయంలో బ్రిడ్జి దాటుతున్న బస్సు నీట మునిగి అందులో ప్రయాణిస్తున్న 29 మంది చనిపోయారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement