Wednesday, April 24, 2024

హాలీవుడ్ మూవీ ది గ్రే మ్యాన్ ట్రైల‌ర్ రిలీజ్ – త‌ళుక్కున మెరిసిన ధ‌నుశ్

త‌మిళ చిత్రాలే కాదు టాలీవుడ్..బాలీవుడ్ చిత్రాల్లో న‌టిస్తున్నాడు హీరో ధ‌నుశ్..కాగా ఇప్పుడు ఓ హాలీవుడ్ మూవీలో న‌టిస్తున్నాడు ధ‌నుశ్. అదే ది గ్రే మ్యాన్ . ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ఆంగ్ల సినిమాలో తమ అభిమాన నటుడు ఎలా కనిపిస్తాడోనన్న ఉత్కంఠ మొదలైంది. ఎప్పుడెప్పుడు ట్రైలర్‌ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. క్రిస్‌ ఎవాన్స్‌- ర్యాన్‌ గోస్లింగ్‌ నేతృత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నెట్‌ ఫ్లిక్సి లో జూలై 22న విడుదల కానుంది. ఆంథోనీ- జో రుస్సో దర్శకత్వంలో రూపొందుతున్న హాలీవుడ్‌ చిత్రం ‘ద గ్రే మ్యాన్‌’. ర్యాన్‌ గోస్లింగ్‌-క్రిస్‌ ఎవాన్స్‌-అనా డి అర్మాస్‌- జెస్సికా హెన్విక- బిల్లీ బాబ్‌ థోర్న్టన్‌ – ఆల్ఫ్రే వుడార్డ్‌ లు ఈ చిత్రంలో నటిస్తున్నారు.ది గ్రే మ్యాన్‌ అనే టైటిల్‌ కి తగ్గట్టే ఈ చిత్రం కోర్ట్‌ జెంట్రీ అనే ఫ్రీలాన్స్‌ హంతకుని కథను తెరపైకి తెస్తోంది. మాజీ ఏజెంట్‌ గురించి 2009 మార్క్‌ గ్రీనీ నవల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. పూర్తిస్థాయి యాక్షన్‌ సన్నివేశాలతో రూపొందిన ఈ ట్రైలర్‌లో ధనుష్‌ ఓ సీన్‌లో తళుక్కున మెరిశారు. చాలా స్టైలిష్‌గా కనిపించారు. ‘కెప్టెన్‌ అమెరికా’, ‘అవెంజర్స్‌’ సిరీస్‌ తదితర చిత్రాలను అందించిన దర్శక ద్వయం రస్సో బ్రదర్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ధనుష్‌తో పాటు రియాన్‌ గోస్లింగ్‌, క్రిస్‌ ఎవాన్స్‌, అనా డి అర్మాస్‌, జెస్సికా హెన్విక్‌ తదితర హాలీవుడ్‌ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ట్రైల‌ర్ రిలీజ్ కావ‌డంతో ధ‌నుష్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=XI-YCVzPVls&t=120s
Advertisement

తాజా వార్తలు

Advertisement