Wednesday, March 29, 2023

షిరిడీ సాయి మ‌హిమ‌.. ఐదేండ్లుగా క‌నిపించ‌కుండా పోయిన ఇంటి డాక్యుమెంట్ల ప్ర‌త్య‌క్షం

షిరిడీ (ప్రభ న్యూస్): హైద‌రాబాద్‌కు చెందిన ఓ భ‌క్తురాలు షిరిడీ సాయిబాబాకు ఇవ్వాల (శ‌నివారం) 7.10ల‌క్ష‌ల బంగారు ఆభ‌ర‌ణం కానుక‌గా అంద‌జేశారు. ఇవ్వాల సాయిబాబా స‌న్నిధికి వ‌చ్చిన పి. క‌ళ్యాణి అనే భ‌క్తురాలు త‌న‌కు ఎదురైన ఓ అద్భుత అనుభ‌వాన్ని ఈ సంద‌ర్భంగా పంచుకున్నారు. నాలుగైదు సంవ‌త్స‌రాల నుంచి త‌మ ఇంటి డాక్యుమెంట్లు క‌నిపించ‌కుండా పోయాయ‌ని, ఎంత వెతికినా త‌మ‌కు దొర‌క‌లేద‌న్నారు.

- Advertisement -
   

ఈ క్ర‌మంలో బాబాను మ‌న‌స్ఫూర్తిగా తాను వేడుకున్నాన‌ని.. ఆ త‌ర్వాత ప‌ది నిమిషాల‌కు ఇంటి డాక్యుమెంట్లు దొరికాయ‌ని చెప్పారు. ఇది నిజంగా బాబా మ‌హిమ వ‌ల్ల‌నే జ‌రిగింద‌ని తాము నమ్ముతున్నామ‌ని, అందుక‌ని బాబాకు కానుక అంద‌జేసిన‌ట్టు తెలిపారు. ఈ సంద‌ర్భంగా షిరీడీ సంస్థాన్ సీఈవో భాగ్య‌శ్రీ బ‌నాయ‌త్ ఆమెను స‌త్క‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement