Thursday, April 25, 2024

Breaking: మునుగోడులో ముగిసిన ఎన్నిక‌ల ప్ర‌చారం.. కేటీఆర్​ ర్యాలీకి ప్ర‌జ‌ల బ్ర‌హ్మ‌ర‌థం!

న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక కోసం రాజ‌కీయ పార్టీల ప్ర‌చారం ఇవ్వాల సాయంత్రంతో ముగిసింది. ఈ బైపోల్ కోసం టీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌తో పాటు ప‌లు చిన్నా, చిత‌కా పార్టీల అభ్య‌ర్థులు పోటీ ప‌డుతున్నారు. అయితే.. ప్ర‌ముఖంగా ఇక్క‌డ త్రిముఖ పోటీ ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నిక వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి టీఆర్ ఎస్‌, బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. గెలుపుకోసం ఈ రెండు పార్టీలు పోటా పోటీ ప్ర‌చారం చేశాయి. పెద్ద ఎత్తున లీడ‌ర్ల‌ను మోహ‌రించిన ఇరు పార్టీలు ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే య‌త్నం చేశాయి.

అయితే.. టీఆర్​ఎస్​ పార్టీ నేతలు కానీ, మంత్రులు కానీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్దిని వివరిస్తూ ప్రచారంలో పాల్గొంటే.. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు టీఆర్​ఎస్​ని టార్గెట్​ చేసి విమర్శలు చేస్తూ ప్రచారం నిర్వహించడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మునుగోడుకు కానీ, తెలంగాణకు కానీ కేంద్రంలోని బీజేపీ ఎట్లాంటి అభివృద్ధి చేసింది, ఇక ముందు ఏం చేయబోతుంది అనే విషయాలను బీజేపీ మంత్రులు స్పష్టంగా చెప్పలేకపోయారు. ఎక్కడ చూసినా దాటవేత ధోరణి, సీఎం కేసీఆర్​ని, కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్​గా చేసుకుని ఆరోపణలు, విమర్శలతోనే వారి ప్రచారం సాగిందన్నది స్పష్టమవుతోంది.

ఇక.. టీఆర్ ఎస్ ఆధ్వ‌ర్యంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు తాము తెలంగాణ‌లో చేప‌ట్టిన డెవ‌ల‌ప్‌మెంట్‌, సంక్షేమ ప‌థ‌కాల‌ను ఇంటింటా వివ‌రిస్తూ వినూత్న‌మైన ప్ర‌చారం నిర్వ‌హించారు. రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు మునుగోడును కూడా అభివృద్ధి చేశామ‌ని, అందులో భాగంగానే చండూరు మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్​లో బెస్ట్​ అవార్డు వచ్చిందని మంత్రి కేటీఆర్​ తెలిపారు. ఈ క్ర‌మంలో కేటీఆర్ చేప‌ట్టిన ప్ర‌చారానికి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఎక్క‌డ ర్యాలీ నిర్వ‌హించినా, ఎక్క‌డ స‌భ పెట్టినా పెద్ద ఎత్తున జ‌నం త‌ర‌లివ‌చ్చి టీఆర్ ఎస్‌కు స‌పోర్టుగా నిలిచారు. మునుగోడు టీఆర్ ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డికే ఓటు వేస్తామ‌ని సోష‌ల్ మీడియాలోనూ ల‌క్ష‌లాది మంది స్వ‌చ్ఛందంగా పోస్టులు పెడుతూ.. ప్ర‌భుత్వ అభివృద్ధిని పొగుడుతున్నారు.

కాగా.. దేశవ్యాప్తంగా 4,355 స్థానిక సంస్థల్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమాన్ని చేపట్టగా.. ఇందులో తెలంగాణలోని 16 మున్సిపాలిటీలు సత్తా చాటి..అవార్డులను సాధించాయి. మొత్తం 90 అంశాలను ప్రాతిపదికన తీసుకుని అవార్డులకు ఎంపిక చేశారు. సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్, లిట్టర్ ఫ్రీ వాణిజ్య ప్రాంతాలు, కమ్యూనిటీ లెవల్ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు వంటి అంశాల వారీగా అవార్డులను ఎంపిక చేశారు. అవార్డులు సాధించిన మున్సిపాలిటీల్లో ఆదిబట్ల, బడంగ్‌పేట్, భూత్‌పూర్, చండూర్, చిట్యాల, గజ్వేల్, ఘట్ కేసర్, హుస్నాబాద్, కొంపల్లి, కోరుట్ల, కొత్తపల్లి, నేరుడుచర్ల, సికింద్రాబాద్, సిరిసిల్ల, తుర్కయాంజల్, వేములవాడ ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement