Saturday, April 20, 2024

కియా, హ్యుందాయ్‌, పిజ్జాహట్‌, కేఎఫ్‌సీలపై ఢిల్లీలో కేసు.. లైసెన్స్‌ రద్దుకు డిమాండ్‌..

న్యూఢిల్లిd : దేశానికి వ్యతిరేకంగా టీట్లు చేసిన కియా, హ్యుందాయ్‌, పిజ్జాహట్‌, కేఎఫ్‌సీలపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లి పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. పాకిస్తాన్‌ను వెనకేసుకొచ్చేలా కంపెనీలు చేస్తున్న టీట్లు ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణానికి దారితీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంటున్నారు. ఈ నాలుగు కంపెనీల లైసెన్సులు రద్దు చేయాలంటూ ఢిల్లిdకి చెందిన న్యాయవాది వినీత్‌ జిందాల్‌ ఫిర్యాదులో తెలిపారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే కార్పొరేట్‌ వ్యవహారాల విభాగంతో పాటు ఢిల్లిd పోలీసుల ఈ నాలుగు కంపెనీలపై ఫిర్యాదు చేశారు.

ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఐపీసీ, ఐటీ యాక్ట్‌లోని 121ఏ, 153, 153ఏ, 504, 505 కింద కేసు నమోదయ్యాయి. తమ వ్యాపార కార్యకలాపాలను విస్తృతం చేసుకోవడం, లాభాలను ఆర్జించడంలో భాగంగా ఈ నాలుగు కంపెనీలు పాకిస్తాన్‌లో కాశ్మీర్‌కు అనుకూలంగా ప్రకటనలు చేశాయని తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌ అత్యంత సున్నితమైన అంశమని, దీన్ని వ్యాపారంగా మార్చుకోవడానికి ప్రయత్నించాయని వినీత్‌ జైన్‌ ఆరోపించారు. అనేక ఏళ్లుగా భారతీయులతో తమకు స్నేహ సంబంధాలు ఉన్నాయని, వారి మనోభావాలు దెబ్బ తీసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అది తప్పు అవుతుందని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement