Thursday, April 25, 2024

Breaking: న‌టుడు విక్ర‌మ్ గోఖ‌లే క‌న్నుమూత‌..

గ‌త కొన్నిరోజులుగా పుణెలోని దీననాథ్ మంగేష్కర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్‌ నటుడు విక్రమ్‌ గోఖలే (77) ఇక లేరు. అనారోగ్య కారణాలతో గత కొన్ని రోజులుగా ఆయన ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ.. ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ కన్నుమూశారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని కొన్ని గంటలపాటు బాలగంధర్వ్ రంగమంచ్‌లో ఉంచనున్నారు.

అనంతరం సాయంత్రం 6 గంటలకు పుణెలోని వైకుంఠ సంశన్‌ భూమిలో అయనకు అంతిమ సంస్కారం నిర్వహించనున్నారు. అంతకుముందు గురువారమే ఆయన మృతిచెందినట్లు ప్రచారం జరిగింది. అజయ్‌దేవగన్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్, అలీ గోని, జావెద్‌ జాఫెరీ ట్విటర్‌లో సంతాపం కూడా తెలిపారు. దాంతో విక్రమ్‌ గోఖలే కుమార్తె, ఆస్పత్రి వైద్యులు మీడియా ముందుకు వచ్చి ఆయన బతికే ఉన్నారని ప్రకటించారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆయన మరణించారు. ఈయన కుటుంబం మొత్తం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లే ఉన్నారు. ఈయన నాన్న చంద్రకాంత్ గోఖలే .. తొలి తరం రంగస్థల నటుడిగా రాణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement