Sunday, June 4, 2023

రోడ్డు ప్ర‌మాదంలో.. టెక్ కంపెనీ సీఈవో మృతి

రోడ్డు ప్ర‌మాదంలో ఓ టెక్ కంపెనీ సీఈవో మృతి చెందారు..ముంబై వ‌ర్లి ప్రాంతంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. దాదర్‌-మాతుంగా ప్రాంతంలో నివాసం ఉండే రాజలక్ష్మి రామకృష్ణన్ (42) ఓ టెక్‌ కంపెనీకి సీఈవో. ఆమెకు రోజూ ఉదయం జాగింగ్‌ చేయడం అలవాటు. తనను తాను ఒక ఫిట్నెస్‌ ఫ్రీక్‌ అని చెప్పుకునే రాజలక్ష్మి.. రోజూలాగే మార్నింగ్‌ వాక్‌కు వెళ్లింది. ఆ సమయంలో అతివేగంగా వచ్చిన టాటా నెక్సాన్‌ ఈవీ కారు ఆమెను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరీక్షించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్‌ 23 ఏళ్ల సుమెర్ మర్చంట్‌గా గుర్తించి అతడిని అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ముంబై పోలీసులు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement