Sunday, September 24, 2023

Breaking: రైలుప్రమాదంలో ఉగ్ర కోణం.. దర్యాప్తుకు మమత డిమాండ్

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రైలు ప్రమాద ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదంలో ఉగ్రకోణం ఉండే అవకాశాలున్నాయంటూ ఆమె ఆరోపించారు. ఒడిశా రైలు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు ఆమె నేడు కోల్ కతా నుంచి బాలసోర్ కు హెలికాప్టర్ లో చేరుకున్నారు. అక్కడ అధికారుల నుంచి ప్రమాద ఘటన గురించి మమతా బెనర్జీ అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు.

- Advertisement -
   

వారందరికీ మెరుగైన వైద్యసేవలందించాలని స్థానిక అధికారులను అభ్యర్థించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలోనూ, క్షతగాత్రులలోనూ అత్యధికులు బెంగాలీలే కావడంతో మమత తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే బెంగాలీలకు చెందిన మృతదేహాలను సత్వరం వారి వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని ఒడిశా ముఖ్యమంత్రిని ఆమె కోరారు. అనంతరం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో ఉగ్రకోణం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రం సమగ్ర దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement