Wednesday, May 25, 2022

కారు లోయ‌లో ప‌డి.. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మృతి

ఓ కారు లోయ‌లోకి దూసుకెళ్లి ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బీడ్​ జిల్లాలో గురువారం తెల్ల‌వారుజామున ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి 60 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు, వారి మేనల్లుడు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రగాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన మసోబా వాడి ఫటా గ్రామానికి సమీపంలో ఈ ప్ర‌మాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు సతీశ్​ పంజుమల్​ టెక్వానీ(58) ఆయన ఇద్దరు సోదరులు శంకర్​(46), సునీల్​(48), మేనల్లుడు లఖన్​ మహేశ్​ టెక్వానీగా (20) గుర్తించారు. వారంతా బీడ్​ నగరం నుంచి అహ్మద్​నగర్​ జిల్లా కేంద్రానికి వెళ్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement