Tuesday, October 8, 2024

గ్రీన్ ఇండియా చాలెంజ్‌కి థ్యాంక్స్‌.. హ‌రిత‌హ‌రంలో పాల్గొన్న స్మితా స‌బ‌ర్వాల్‌

8వ సీజ‌న్ హ‌రిత‌హారంలో భాగంగా ఇవ్వాల (శుక్ర‌వారం) తెలంగాణ సీఎంవో కేసీఆర్‌ సెక్ర‌ర‌టీ స్మితా స‌బ‌ర్వాల్ మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా ఆమె గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్‌కు థ్యాంక్స్ చెప్పారు. తెలంగాణ‌లో హ‌రిత‌హారంతోపాటు గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో పెద్ద ఎత్తున మొక్క‌లు నాటిస్తూ.. అంద‌రిలో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న ఎంపీ సంతోష్‌కుమార్ అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నార‌న్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌, హ‌రిత హారం కార్య‌క్ర‌మాల‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్ర‌తి ఒక్క‌రు మొక్క‌లు నాటి వాటి సంరక్ష‌ణ బాధ్య‌త‌లు తీసుకోవాల‌ని ట్వీట్​ ద్వార తెలిపారు స్మిత స‌బ‌ర్వాల్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement