Friday, April 19, 2024

గంగూభాయ్ లా మారిన థాయ్ లాండ్ వృద్ధ‌మ‌హిళ‌- వైర‌ల్ గా ఫొటో

బాలీవుడ్ బ్యూటీ ఆలియాభ‌ట్ ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్రం గంగూబాయి కతియావాడి. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ జనాల గుండెల్లోంచి వెళ్లడం లేదు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి వైట్ శారీ, ఎర్రటి బిందితో అలియా భట్‌లా కనిపిస్తున్న గంగూబాయి లుక్‌ని కాపీ కొట్టేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. గంగూబాయి లుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌ను కూడా ప్రారంభించింది. గంగూబాయిలా మారింది ఒక వృద్ధ మహిళ ..ప్ర‌స్తుతం ఆ వృద్ధ మహిళ ఫోటో వైరల్ అవుతోంది.ఈమె థాయ్‌లాండ్‌కు చెందినది..ఈ మహిళ తెల్లని దుస్తులపై తెల్లటి ఎంబ్రాయిడరీ స్కార్ఫ్, ఆమె నుదిటిపై పెద్ద ఎర్రటి బిందీ, ఎరుపు లిప్‌స్టిక్, నల్ల గ్లాసెస్, హ్యాండ్‌బ్యాగ్ ధరించి ఉంది. గంగూబాయిలా మారిన ఆమె కారు ముందు పోజులిచ్చింది. ఆ ఫొటో చూసిన ఆలియా ఇలా రాసింది – ‘థాయ్‌లాండ్ నుండి చాలా ప్రేమ, ధన్యవాదాలు అని తెలిపింది

Advertisement

తాజా వార్తలు

Advertisement