Wednesday, July 28, 2021

చలో రాజ్ భవన్ టెన్షన్… అడ్డుకుంటున్న పోలీసులు

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన చలో రాజ్ భవన్ పై టెన్షన్ నెలకొంది. ధర్నా నేపథ్యంలో ఇప్పటికే ఇందిరా పార్కు వద్దకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో ఇందిరా పార్కు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లనున్నాయి. అయితే దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణ నెలకొంది.

మరోవైపు ఎక్కడికక్కడ నేతలను ధర్నాలో పాల్గొనకుండా అరెస్ట్ చేస్తున్నారు. జిల్లాల్లోనూ కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్భందం చేశారు. చలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ వెళ్ళకుండ ఇవాళ 6గంటల నుండే కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్స్ కి తరలించారు. కరీంనగర్, నిజామాబాద్, వికారాబాద్ తదితర జిల్లాల్లో కాంగ్రెస్ నాయకులను హైరదాబాద్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.

చలో రాజ్ భవన్ టెన్షన్... అడ్డుకుంటున్న పోలీసులు

కాంగ్రెస్ శ్రేణుల్ని అడ్డుకుంటే పోలీస్‌స్టేషన్లు ముట్టడిస్తామని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పోలీసులు అడ్డుకోవడం, కేసులు పెట్టడం నిత్యకృత్యమైందని మండిపడ్డారు. ధరల పెరుగుదలపై పార్లమెంటులో కేంద్రాన్ని ఎండగడతామన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పిలునిచ్చిన చలో రాజ్ భవన్ పై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా, పెట్రో ధరలకు నిరసనగా ఇప్ప‌టికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎడ్ల‌బండ్ల ర్యాలీలు, సైకిల్ యాత్ర‌లు చేప‌ట్టి నిర‌స‌నలు తెలిపారు. తాజాగా చ‌లో రాజ్ భ‌వ‌న్ కు పిలుపునిచ్చారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News