Thursday, April 18, 2024

Cold Weather: గజగజ వణుకుతున్న తెలంగాణ

తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. సాయంత్ర 5 గంటల నుంచే చలి తీవ్ర పెరుగుతోంది. చలితో జనం వణికిపోతున్నారు. ఉదయం 9 గంటల తర్వాతే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. హైదరాబాద్ నగరంలో చలి పంజా విసురుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా నగరంలో కొద్దిరోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దట్టమైన పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నాయి.

తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండడంతోనే చలి పెరిగిందని వాతావరణశాఖ తెలిపింది. ఈ రోజు 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని, చలి తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది. చలి తీవ్రత పెరగడం, శీతల గాలులు వీస్తున్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు నిన్న కుమురంభీం జిల్లా గిన్నెధరిలో అత్యంత కనిష్ఠంగా 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 6.8, మెదక్‌లో 8.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement