Thursday, April 25, 2024

ఎండలు బాబోయ్ ఎండలు..

గతవారం రోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గరిష్ఠంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. తెలంగాణలో మూడు రోజులపాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ సహా పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఎండలో బయటకు రావొద్దని అధికారులు సూచించారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే.. మే నెల ఆఖరికి వచ్చేసరికి ఉష్ణోగ్రతలు ఎంతగా పెరిగిపోతాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  మార్చి చివరినాటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ప్రజలు భయందోళనలు చెందుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎండ వేడిమి అధికంగా ఉంది. అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో నమోదు అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement