Thursday, April 18, 2024

తెలంగాణ ఆర్టీసీ మ‌రో ఆఫ‌ర్ – ఆ రెండు గంట‌లు ఫ్రీ జ‌ర్నీ

ఇప్ప‌టికే చాలా ఆఫ‌ర్ లు ప్ర‌క‌టిస్తూ ప్ర‌యాణికుల‌ను ఆక‌ట్టుకుంటోంది తెలంగాణ ఆర్టీసీ. రీసెంట్ గా ప్ర‌యాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ మరో ఆఫర్ ప్రకటించింది. సుదూర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులో నగరానికి చేరుకునే ప్రయాణికులు.. తిరిగి సిటీ బస్సుల్లో ఉచితంగా ఇంటికి చేరుకునేందుకు వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 250 కిలోమీటర్లు పైగా ఆర్టీసీ బస్సుల్లో నగరానికి చేరుకున్న ప్రయాణికులు మొదటి రెండు గంటల లోపు సిటీ బస్సులో నగరవ్యాప్తంగా ఎక్కడైనా ఉచితంగా వెళ్లేందుకు అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ ఆఫర్ ను అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. 250 KM ల పై ఉన్న దూర ప్రాంతాలకు ముందస్తు #TSRTCTicket రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తమ ఇంటి వద్ద నుండి #TSRTCBus ఎక్కు ప్రాంతం వరకు సిటీలో ఉచితంగా ప్రయాణించవచ్చు. #Hyderabad జంటనగరాలలో ప్రయాణానికి 2 గంటలు ముందు, మరియు ప్రయాణం తర్వాత 2 గంటలు వర్తిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement