Saturday, July 24, 2021

తెలంగాణలో నిషేధించిన గుట్కా మంత్రులకు ఎలా దొరికింది?.. వీడియో విడుదల చేసిన దాసోజు శ్రవణ్

మంత్రులు త‌ల‌సాని, గంగుల క‌మాల‌క‌ర్ గుట్కా సీక్రెట్ కెమెరాల‌కు చిక్కింది. ఎవ‌రూ చూడ‌కుండా త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మ‌రో మంత్రి గంగుల‌కు గుట్కా ఇవ్వ‌టం… దాన్ని ఆయ‌న అంతే చాటుగా నోట్లే వేసుకోవ‌టం కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో మంత్రులు తలసాని శ్రీనివాస్, గంగుల కమలాకర్‌ల తీరుపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.

మంత్రులు గుట్కా తింటున్న వీడియోను దాసోజు శ్రవణ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘తెలంగాణలో పొగాకు, గుట్కా బ్యాన్ చేసిండ్రు కదా. మరి ఈ మంత్రులకు యెట్లా దొరికింది? ఎవరు స్మగుల్ చేస్తుండ్రు? ఎట్లా సప్లై చేస్తుండ్రు?బందు బెట్టిన గుట్కాను, బాజాప్తాగా తింటున్న మంత్రులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాల్నా లేదా?’ అంటూ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News