Thursday, April 25, 2024

తెలంగాణలో మరో పది రోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు.. సడలింపు సమయం ఇవే!

తెలంగాణలో లాక్ డౌన్ ను మరో 10 రోజులు పొడిగించారు. ప్రగతి భవన్‌లో సుధీర్ఘంగా భేటీ అయిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో వానాకాలం పంటలు, సాగునీటి అంశాల పై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, లాక్‌డౌన్‌ విషయంపైనా సమావేశంలో చర్చించారు. జూన్ 10 నుంచి  మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అంటే గంట పాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది.

సాయంత్రం ఆరు గంటల నుంచి తిరిగి తెల్లారి ఉదయం ఆరు గంటల వరకు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను కేబినెట్ ఆదేశించింది. కరోనా పూర్తిగా అదుపులోకి రాని..   సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజక వర్గాల పరిధిలో మాత్రం, లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యథాతథ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. కాగా, ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ లాక్ డౌన్ సడలింపు ఉన్న సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: తెలంగాణ పీసీసీ చీఫ్ కౌన్ ?

Advertisement

తాజా వార్తలు

Advertisement