Thursday, March 28, 2024

గుడ్ గ‌వ‌ర్నెన్స్ ర్యాంకుల్లో తెలంగాణ‌.. రెండు విభాగాల్లో నెంబ‌ర్ వ‌న్..

2020-21 సంవత్సరానికి కేంద్రం వెలువరించిన గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం రెండు అవార్డులతో మెరిసింది. పారిశ్రామికీకరణ, వాణిజ్యం, సోషల్‌ వెల్ఫేరర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇందుకు ఇక్కడి పరిశ్రమల అభివృద్ధి, స్టార్టప్‌ ఎకో సిస్టం, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (ఈవోడీబీ)లో మెరుగైన స్థానం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పని తీరు అంశాల ఆధారంగా పరిశ్రమల విభాగంలో మొదటి ర్యాంకును తెలంగాణ కైవసం చేసుకుంది.

ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత, నిరుద్యోగ రేటు, హౌజింగ్‌ ఫర్‌ ఆల్‌, లింగ సమానత్వం, ఎకానమిక్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ వుమెన్‌ సూచీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచినందుకు సోషల్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కేటగిరీలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వాల పాలనలోని పది రంగాలకుగానూ 58 సూచీలతో అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఈ ర్యాంకులను కేటాయిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement