Friday, April 26, 2024

Omicron variant: తెలంగాణలో ఒమిక్రాన్ టెర్రర్.. గాలి ద్వారా సోకె ప్రమాదం!

కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ తెలంగాణలో కూడా బయటపడింది. మూడు కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈమేరకు ఒక ప్రకటన జారీ చేసింది. అబుదాబి నుంచి వచ్చిన ఒక ప్రయాణీకుడికి, అలాగే కెన్యా నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా సోకినట్లు తేలింది. టోలిచౌక్‌కు చెందిన ఆ మహిళ అడ్రస్‌ను రాత్రి తెలుసుకున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని వ్యక్తులకు ఒమిక్రాన్‌ సోకలేదని స్పష్టం చేసింది. ఒమిక్రాన్‌ సోకిన వారిని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది.

హైదరాబాద్‌ నుంచి విదేశాలకు వెళ్లిన మరో ప్రయాణికుడికి ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. ప్రయాణికుడు వెళ్లిపోయిన తర్వాత ఒమిక్రాన్‌గా గుర్తించారు. దీంతో తెలంగాణలో ప్రస్తుతానికి రెండు యాక్టివ్ ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో అన్ని జిల్లాల వైద్యాధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో తొలిసారిగా రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయ‌ని శ్రీనివాస‌రావు అధికారికంగా ప్ర‌క‌ట‌న చేశారు. ఒమిక్రాన్ సోకిన వారిలో ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా క‌న‌ప‌డుతున్నాయని చెప్పారు. త‌ల‌నొప్పి, నీరసం, జ‌లుబు, ద‌గ్గు వంటివి లక్షణాలు ఉన్నాయని చెప్పారు. కెన్యా నుంచి ఈ నెల 12న రాష్ట్రానికి వచ్చిన యువతికి ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిందని వెల్లడించారు. సోమాలియాకు చెందిన ఓ వ్య‌క్తికి కూడా ఒమిక్రాన్ సోకిన‌ట్లు వివరించారు. బాధితుల‌ను టిమ్స్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నామన్నారు. మ‌రో వ్య‌క్తికి ఎయిర్‌పోర్టులో పాజిటివ్ గా తేలిందన్నారు. అయితే, ఆ వ్య‌క్తి ప‌శ్చిమ బెంగాల్‌కు చెంద‌ని వ్య‌క్తి అని, రాష్ట్రంలోకి రాలేదని శ్రీనివాసరావు చెప్పారు.

రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఇద్ద‌రు ఒమిక్రాన్ బాధితులు మాత్ర‌మే ఉన్నారని ఆయ‌న స్పష్టం చేశారు. ఒమిక్రాన్‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం నిపుణుల వ‌ద్ద కూడా లేదన్న హెల్త్ డైరెక్టర్.. ఇప్పుడే అది వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ప్ర‌స్తుతం 77 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు ఉన్నాయని తెలిపారు. ప్ర‌జ‌లు అజాగ్ర‌త్తతో వ్య‌వ‌హ‌రిస్తే ఒమిక్రాన్ బారిన‌ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. మాస్కు ధ‌రించ‌డం, సామాజిక దూరం పాటించ‌డం వంటి చ‌ర్య‌లు తీసుకుంటే వ్యాప్తిని త‌గ్గించ‌వ‌చ్చ‌ని తెలిపారు. వ్యాక్సిన్లు వేయించుకుంటే ఒమిక్రాన్ తీవ్ర‌త‌ను త‌గ్గించ‌వ‌చ్చ‌ని శ్రీనివాస రావు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement