Sunday, December 8, 2024

కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం.. మార్గదర్శకాలు ఇవీ

కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.50 వేల ఎక్స్ గ్రెసియా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధుల నుండి పరిహారంగా అందించనున్నారు. అయితే, తాజాగా ఇందుకు సంబంధించిన మార్గ దర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. కోవిడ్ డెత్ అని ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు అధికారులతో కమిటీ వేసింది. కోవిడ్ తో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత డాక్యుమెంట్ లు అప్లోడ్ చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించి అర్హులైన వారికి పరిహారం ఇస్తారు. దరఖాస్తు అందిన 30 రోజుల్లో సెటిల్ చేయాలని, అర్హులైన వారికి ఆధార్ తో లింక్డ్ బ్యాంక్ అకౌంట్ లో(DBT) డబ్బులు వేయాలని ప్రభుత్వం పేర్కొంది.

ఇది కూడా చదవండి: వ్యాక్సిన్ వేసుకోకుంటే జీతం బంద్.. ఎక్కడంటే

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement