Thursday, March 28, 2024

ఊరట: ఆరోగ్యశ్రీలోకి కరోనా వైద్యం..!

కరోనా థర్డ్ వేవ్ ముందట తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఊరటనిస్తోంది. ఇప్పటికే మొదటి, రెండో వేవ్ లో అల్లకల్లోలం సృష్టించిన కరోనా థర్డ్ వేవ్ ఆందోళనలు తారాస్ఠాయిలో ఉన్నాయి. ఇక కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో ఎక్కువగా ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి ఎక్కువగా వినిపించిన మాట కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని. ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ (ఏబీ)లో కరోనా చికిత్సను ఇప్పటికే చేర్చగా, ఏబీని రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు. దీంతో ఇకపై ఈ పథకం ‘ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్’ పేరిట అమలు కానుంది.

కరోనా చికిత్సను మొత్తం 17 రకాలుగా విభజించగా, అందులో 14 రకాలకు ప్రభుత్వాసుపత్రులలో వైద్యం అందిస్తారు. క్రమంగా దీనిని ప్రైవేటు ఆసుపత్రులకూ విస్తరిస్తారు. అక్యూట్‌ ఫెబ్రైల్‌ ఇల్‌నెస్‌, పైరెక్సియా ఆఫ్‌ అన్‌నోన్‌ ఆరిజిన్‌, నిమోనియా ఉన్నాయి. వీటితోపాటు మిగిలిన 14 రకాలకు ప్రభుత్వాసుపత్రులలోనే వైద్యం అందనుండా.. దశలవారీగా ప్రైవేట్ ఆస్పత్రలకు విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. 50 పడకలున్న ఆసుపత్రులకు మాత్రమే ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి అనుమతి లభిస్తుండగా, ఆయుష్మాన్ భారత్ చేరికతో ఆరు పడకలున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు, 30 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ రాకతో ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చిన చికిత్సల సంఖ్య 1,668కి పెరిగింది. అయితే వీటిలో 642 చికిత్సలను ప్రస్తుతానికి ప్రభుత్వ వైద్యంలోనే కొనసాగించాలని నిర్ణయించారు. మరోవైపు.. ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ పరిధిలో కేవలం 50 బెడ్స్‌ ఉన్న ఆస్పత్రులకు మాత్రమే అనుమతి ఉండగా.. ఆయుష్మాన్‌ భారత్‌ చేరికతో ఇకనుంచి 6 బెడ్స్‌ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో.. 30 బెడ్స్‌ ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 6 బెడ్స్‌ ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ను అమలు చేయడానికి అవసరమైన గైడ్‌లైన్స్‌ను రూపొందించిన తర్వాత.. దీనిపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement