Friday, April 19, 2024

TS: బాస‌ర ట్రిపుల్ ఐటీలో ఫీజు మాఫీ.. విద్యార్థుల‌కు 40శాతం డిస్కౌంట్ ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం

ప్రభుత్వ స్కాల‌ర్‌షిప్‌న‌కు అర్హతలేని బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా నేపథ్యంలో రెండు విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజులో 40 శాతం మినహాయింపునిచ్చింది. ఈ మేర‌కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విష‌యాన్ని ఇవ్వాల (శుక్ర‌వారం) వెల్లడించారు. 2018 – 19, 2019 -20 విద్యా సంవత్సరాల్లో కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులు జరగక పోవడం, వసతి గృహాల నిర్వహణ లేకపోవడం వల్ల విద్యార్థులపై భారం పడకుండా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మంత్రి తెలిపారు.

మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రభుత్వం విద్యార్థులకు ఊరట కల్పించిందని మంత్రి వెల్లడించారు. అంతే కాకుండా ప్రభుత్వపరంగా స్కాల‌ర్‌షిప్‌న‌కు అర్హత ఉన్న విద్యార్థులకు సకాలంలో స్కాల‌ర్‌షిప్‌ అందలేదన్న కారణంతో వారి సర్టిఫికెట్లను ఇవ్వకపోవటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చారని మంత్రి తెలిపారు. స్కాల‌ర్‌షిప్‌తో సంబంధం లేకుండా విద్యార్థులకు వారి సర్టిఫికెట్లను అడిగిన వెంటనే అందించాలని బాసర ట్రిపుల్‌ఐటీ వైస్‌చాన్స్‌లర్‌ను మంత్రి ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement