Tuesday, April 23, 2024

లబ్ధిదారుల ఖాతాలో దళితబంధు నిధులు.. చెక్ చేసుకోండి!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం అమలు చేస్తున్న దళితబంధు పథకం నిధులు లబ్ధిదారులకు అందాయి. సీఎం కేసీఆర్ హామీ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రిలో ఉన్న లబ్ధిదారుల ఖాతాల్లో దళితబంధు నిధులు జమయ్యాయి. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకుగానూ 66 మంది ఖాతాల్లో నగదు జమ చేశారు. ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున నగదును జిల్లా కలెక్టర్‌ ఖాతా నుంచి లబ్ధిదారుల అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసింది.

హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే దళిత బంధు అమలు చేసిన ప్రభుత్వం రూ.2వేల కోట్ల నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని.. దళిత ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, నాగర్‌ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాలను దళిత బంధు పథకం అమలు కోసం ఎంపిక చేశారు. ఈ నాలుగు మండల్లాలోని అర్హత కలిగిన దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింప చేయాలని నిర్ణయించారు.

ఇది కూడా చదవండి: అడగాల్సింది ఎవర్ని?: మోహన్ బాబుకు నాగబాబు కౌంటర్

Advertisement

తాజా వార్తలు

Advertisement