Thursday, February 2, 2023

Telangana | అజ్మీర్ ద‌ర్గాకు తెలంగాణ ప్ర‌భుత్వం చాద‌ర్‌.. ఉర్సు సంద‌ర్భంగా అంద‌జేసిన సీఎం కేసీఆర్‌

అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే ‘చాదర్’ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ ఏడాది కూడా సమర్పించారు. బుధవారం ప్రగతి భవన్ లో ముస్లిం మతపెద్దల సమక్షంలో దైవ ప్రార్థనలు జరిపిన అనంతరం చాదర్ ను ఆజ్మీర్ దర్గాలో సమర్పించేందుకు సీఎం కేసీఆర్ వక్ఫ్ బోర్డు అధికారులకు అందచేశారు. ఈ సందర్భంగా… మంత్రులు మహమ్మద్ మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూధనాచారి.. మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్., ఎమ్మెల్యేలు మహమ్మద్ షకీల్, గ్యాదరి కిశోర్ కుమార్, సుధీర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement