Friday, April 19, 2024

విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని బుధవారం నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. ఈ రెండు పండుగల సందర్భంగా ఈ నెల 6 నుంచి 17వ తేదీ వరకు 12 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి ఈ నెల 18న పాఠశాలలు తెరుచుకోనున్నాయి.

ఇక, ఇంటర్‌ కాలేజీలకు ఈ నెల 13వ తేదీ నుంచి సెలవులు ఇవ్వున్నారు. 13 నుంచి 16 వరకు నాలుగు రోజులు మాత్రమే సెలవులు ఉంటాయి. తిరిగి ఈ నెల 17న కాలేజీలు ప్రారంభమవుతాయి.

ఇదిలా ఉండగా కరోనా నేపథ్యంలో ఇంతకాలం విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు జరగ్గా.. సెప్టెంబర్ 1 నుండి ప్రత్యక్ష బోధన మొదలైన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement