Friday, March 29, 2024

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,813 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం నాడు మరో 1,801 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,301 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులున్నాయి. ఈరోజు జీహెచ్ఎంసీలో 179 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 1,29,896 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement