Saturday, April 20, 2024

తెలంగాణలో కరోనా కేసుల అప్డేట్..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వేవ్ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 322 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కాగా… ముగ్గురు మృతి చెందారు.. ఇదే సమయంలో 331 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,58,376 కు చేరుకోగా.. రికవరీల సంఖ్య 6,48, 876 కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 3876 కు చేరుకుంది.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 71, 402 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు బులెటిన్‌లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ప్రస్తుతం తెలంగాణ లో యాక్టివ్‌ కరోనా కేసుల సంఖ్య 5862 గా ఉంది.

ఇది కూడా చదవండి: చోరి చేసి కాళ్లు మొక్కిన దొంగలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement