Saturday, April 20, 2024

తెలంగాణలో కొత్తగా 4,976 కరోనా కేసులు.. తగ్గాయా? తగ్గించారా?

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 55,358 కరోనా టెస్టులు నిర్వహించగా.. 4,976 పాజిటివ్‌ కేసులు.. 35 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,97,361కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 2,739 మంది మృతి చెందారు. కరోనా నుంచి 4,28,865 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 65,757 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా రెండు రోజులుగా తెలంగాణ కరోనా కేసుల బులెటిన్‌ను అధికారులు ఉదయం పూట కాకుండా సాయంత్రం పూట విడుదల చేస్తుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement