Monday, May 29, 2023

కాంగ్రెస్ నేత‌లు ఇంతే….సీనియ‌ర్ల సిగ‌ప‌ట్లు….పార్టీలో కుంప‌ట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: అధికారమే లక్ష్యంగా పనిచేయాల్సిన కాంగ్రెస్‌ సీనియర్ల వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీకి పెను సమస్యగా పరిణమిస్తోంది. షెడ్యూల్‌ కార్యక్రమా ల్లో కూడా ఆసక్తిగా పాల్గొనలేకపోతున్న నేతలను ఏ పద్ధతితో దారిలోకి తేవాలో తెలియక పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సైతం సతమతమవుతున్నారు. మూడు దశాబ్దాల పైబడి రాజకీ యాల్లో క్రియాశీలకంగా పనిచేసి, అధికారంలో ఉన్న సంద ర్భంలో కీలక పదవులను సైతం అనుభవించిన వారంతా నేడు మాకెందుకులే అన్నట్లుగా వింత వైఖరిని అవలంభిస్తున్నారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే, తలపండిన నాయకుల నుంచి ఏ సమయంలో, ఎలాంటి ముప్పు పొంచి ఉందో తెలియని పరిస్థితి నెలకొంటోంది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం జరిగిన కొత్తలో తీవ్రమైన సమస్యగా కనిపించిన సీనియర్ల దాగుడుమూతల వ్యవహారం రెండేళ్ళ తర్వాత మళ్ళీ తెరపైకి వస్తోంది. ఆసక్తిగా పనిచేస్తున్న యువ నేతలకు మార్గనిర్దశం చేయాల్సిన బాధ్యతలను మరిచి మాకెం దుకులే అనే.. సీనియర్ల సంఖ్య పెరుగుతోంది. ఆ ప్రభావం నియోజకవర్గాల్లో తీవ్రంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న పుడు పదవులను అనుభవించి, పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు కాపాడుకోవాలన్న తపన, నిబద్ధత లేకపోవడాన్ని యువ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

- Advertisement -
   

జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలిచినా పలుకని నేతల మధ్య రాజకీయంగా ఎదుగాలన్న ప్రయత్నం, ఆకాంక్ష ఎలా ఫలిస్తుందన్న ప్రశ్న ఉత్పన్నమ వుతోంది. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ వ్యూహం ప్రశ్నార్థకమయ్యే ప్రమాదమూ పొంచి ఉంది. రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్న రెండోతరం నాయకులంతా ఇప్పుడున్న రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వారంతా సీనియర్ల ఆదరణ కోరుకుంటున్న నేపథ్యంలో స్పందించకపోవడం అనేది భవిష్యత్‌ కార్యాచరణకు ఆటంకం కలిగించే అంశంగా మారుతోంది. తాజాగా కాంగ్రెస్‌ కురు వృద్ధుడు డి.శ్రీనివాస్‌ పార్టీలో చేరిక, ఆ వెంటనే రాజీనామా చేసిన వ్యవహారం తర్వాత మిగతా సీనియర్ల పరిస్థితి ఏమిటన్న చర్చ జోరుగా సాగుతోంది. నాలుగు దశాబ్దాల రాజకీయ అను భవం ఉన్న కె.జానారెడ్డి, వి.హనుమంతరావులు అప్పుడ ప్పు డు అప్పడప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వారి అనుభవం పార్టీ అభివృద్ధికి ఏ కోణం లోనూ ఉపయోగపడడం లేదన్న ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. అలాగే తన తండ్రి కాలం నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్‌కు విధేయత గల కుటుంబమంటూ పేరున్న దామో దర్‌ రాజనర్సింహ కూడా పార్టీ అభివృద్ధికి సంతృప్తిగా పని చేయడం లేదన్నది బహిరంగ రహస్యమే. తన తమ్ముడు రాంచందర్‌ను బీజేపీలోకి పంపించడం తెరవెనుక కాంగ్రెస్‌ కొంపముంచే ప్రయత్నంలో భాగమేనన్న విమర్శలున్నాయి.

ఇలా ఒకరిద్దరి వ్యవహారాన్ని ఉదాహరణగా తీసుకున్నా.. తెరవెనుక అనేకమంది సీనియర్లు వచ్చే ఎన్నికల్లో పార్టీ కొంప ముంచే ప్రయత్నంలో ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెతు ్తతున్నా³యి. ఇలాంటి నాయకులను పగ్గాలేసి కట్టినా ఫలితం ఉండదని నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పెరుగుతున్న అంతర్గత సమస్యలు పరిష్కారమయ్యే మార్గంవైపు ఆలో చించేవారు కూడా వేళ్ళపై లెక్కబెట్టే స్థాయికి తగ్గిపోయారు. నియోజకవర్గస్థాయిలో ఉన్న బీఆర్‌ఎస్‌ వ్యతిరేక పవనాలను ఏకం చేసి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో నాయకులంతా ఏకమై పనిచేస్తే తప్ప తెలంగాణాలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు కనిపించడం లేదు. ఇప్పడు కాదు, పీసీసీ చీఫ్‌గా అప్పాయింట్‌ అయిన కొత్తలోనే కాంగ్రెస్‌ రాజకీయాలు అర్థం చేసుకోవడం అనుకున్నంత ఈజీ వ్యవహారం కాదని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ప్రస్తు తం ఆయన పరిస్థితి చూస్తుంటే ఇప్పటికీ కాంగ్రెస్‌ రాజకీ యాలు పూర్తిగా అర్థమైనట్లు- లేదు. నిజానికి రేవంత్‌ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఎలా వచ్చింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఉనికిని కోల్పోయే పరిస్థితుల్లో జవసత్వాలు నింపే నాయకుడొకరు కావాలన్న కోణంలో ఏఐసీసీ అధిష్టానం రేవం త్‌కు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో తన వాగ్ధాటితో కేడర్‌ను ఉత్తేజపరిచి జవసత్వాలు నింపిన రేవంత్‌కు ఎన్నికల్లో ముందడుగు వేసే క్రమంలో సీనియర్ల నుంచి ఆశించిన సహకారం అందడంలేదు.

పంజాబ్‌ పీసీసీ చీఫ్‌గా నవజ్యోతి సింగ్‌ సిద్దు, తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ రెడ్డి పేర్లను స్వయంగా రాహుల్‌ గాంధీనే ఎంపిక చేశారు. అందుకే, రేవంత్‌ రెడ్డి నియామకాన్ని తెలం గాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు చాలా వరకు అయిష్టంగా అంగీకరించారే కానీ, హృదయపూర్వకంగా స్వాగతించలేదు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో పుట్టి పెరిగిన సీనియర్‌ నాయ కులు… ఎక్కడో పుట్టి ఇంకెక్కడో పెరిగి వచ్చిన రేవంత్‌ రెడ్డి మూడేళ్ళు అయినా నిండకుండానే, పార్టీ బాస్‌గా పెత్తనం చెలా యించడం అనే అంశాన్ని జీర్ణించుకోలేక పోయారు. అందుకే ఆయన అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో అసమ్మతి సెగ రాజుకుంటూనే వుంది. మునుగోడు ఉప ఎన్నిక ఓటమికి కూడా రేవంత్‌రెడ్డి నాయకత్వం పట్ల పార్టీ సీనియర్‌ నాయకుల అసమ్మతి, వ్యతిరేకతలే కారణమనన్‌ ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. రేవంత్‌ రెడ్డి తప్పొప్పులకు కర్త, కర్మ, క్రియ అన్నీ మాజీ ఇన్‌చార్జి ఠాగూరేనని అని ఫిర్యాదు చేయడమే కాకుండా ఆయన స్థానంలో రాష్ట్ర రాజకీయల పట్ల అవగాహన ఉన్న సీనియర్‌ నాయకులను రాష్ట్ర వ్యవహారాల బాధ్యునిగా నియమించాలని కేంద్ర దూతగా వచ్చిన దిగ్వి జయ్‌ సింగ్‌ వద్ద మొర పెట్టు-కున్నారు.

అయితే ఇది పార్టీని బతికించుకునేందుకు చేసిన ప్రయత్నమా అంటే కాదు. ఠాగూ ర్‌కు ఉద్వాసన పలికితే పీసీసీ అధ్యక్ష పదవి నుంచి రేవంత్‌ రెడ్డిని సాగనంపడం ఈజీ అవుతుందని భావించిన సీనియర్లు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. కానీ అవేవీ సాధ్యం కాలే దు. మరో సీనియర్‌ నేత మాణిక్‌రావు ఠాక్రే అధిష్టానం దూతగా వచ్చినప్పటికీ సీనియర్లలో మార్పు కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే సీనియర్ల నుంచి సమస్యలు ఎదుర్కుం టున్న రేవంత్‌ రెడ్డి ముందు ముందు మరింతగా సమస్యలు ఎదుర్కోక తప్పదని అంటు-న్నారు. తాను ఎవరినీ ఇబ్బంది పెట్టాలని అనుకోలేదని కుండబద్ధలు కొట్టి మరీ చెప్పినప్పటికీ సీని యర్లలో మార్పు రాకపోవడాన్ని రేవంత్‌ తీవ్రంగా తప్పు బడుతున్నారు. ఈ పరిణామాలు వచ్చే ఎన్నికల్లో పార్టీ మను గడను ప్రశ్నార్థకం చేస్తాయని విశ్లేషకులు చెబు తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement