Friday, April 26, 2024

సెప్టెంబర్ 3న తెలంగాణ కేబినెట్ భేటీ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అధ్యక్షతన సెప్టెంబర్ 3వతేదీన తెలంగాణ కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం అదేరోజు టీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. శనివారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్‌లో భేటీ జరుగనున్నది. టీఆర్ఎస్ అధినేత అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు సైతం పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతనంగా అమలు చేస్తున్న పెన్షన్లపై చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement