Thursday, April 18, 2024

నేటితో బడ్జెట్ సమావేశాలు ముగింపు.. అసెంబ్లీకి రానున్న సీఎం!

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. 2022–23 ఆర్థిక సంవ‌త్స‌రా‌నికి రాష్ట్ర ద్రవ్య విని‌మయ బిల్లును మంగ‌ళ‌వారం అసెం‌బ్లీలో ప్రవే‌శ‌పె‌ట్ట‌ను‌న్నారు. ఈ బిల్లుపై చర్చ అనం‌తరం సభ ఆమో‌దిం‌చ‌ను‌న్నది. శాస‌న‌మం‌డ‌లి‌లోనూ బిల్లుపై చర్చ అనం‌తరం ఆమో‌దిం‌చ‌ను‌న్నారు. ఈనెల 7 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. అదే రోజు ఆర్థిక మంత్రి హరీష్ రావు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ నెల 9న అసెంబ్లీ వేదికగా సీఎం కేసీ‌ఆర్‌ 91,142 ఉద్యో‌గా‌లను భర్తీ ‌చే‌స్తా‌మని ప్రక‌టిం‌చారు. అనంతరం అనం‌తరం వివిధ పద్దు‌లపై శాస‌న‌సభ సుదీ‌ర్ఘంగా చర్చి‌స్తు‌న్నది. మొత్తం 37 బిల్లులు శాసనసభ ఆమోదం పొందాయి. నేడు ద్రవ్య విని‌మయ బిల్లు ఆమోదం అనం‌తరం శాస‌న‌సభ సమా‌వే‌శాలు నిర‌వ‌ధి‌కంగా వాయిదా పడే అవ‌కా‌శా‌లు‌ ఉన్నాయి.

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం అసెంబ్లీకి హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా స్వల్ప అస్వస్థతతో ఉన్న సీఎం కేసీఆర్.. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే సమావేశాలకు నేడు(మార్చి 15) చివరి రోజు కావడంతో ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం సభకు హాజరు కానున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement