Friday, March 29, 2024

నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు!

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. శుక్రవారం సభలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇవాళ అన్ని బిల్లులకు ఆమోదం లభించనుంది. బతుకమ్మ పండుగ వస్తున్న నేపథ్యంలో ముందుగానే అసెంబ్లీ సమావేశాలు ముగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నేడు ఉభయ సభల్లో మొదటగా ప్రశ్నోత్తరాలనూ చేపట్టనున్నారు.

సోలార్ మరియు పవన విద్యుత్ ఉత్పత్తి, రైతుల నుండి పత్తి సేకరణ, చీమల వారి గూడెం నుంచి వేరే పల్లి గ్రామం మధ్య రోడ్డు కం బ్రిడ్జి నిర్మాణం, భారీ వర్షాల వల్ల పంట నష్టం, షెడ్యూల్లో కులం లోనికి వాల్మీకి సామాజిక వర్గం, రాష్ట్ర అభివృద్ధిపై నీతి ఆయోగ్ ప్రశంస లాంటి వాటిపై ఏడవ రోజు సమావేశాల్లో చర్చకు రానున్నాయి. ఇక శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత.. తెలంగాణలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు.

అలాగే…. హజ్ హౌజ్, రాష్ట్రంలో విద్యుత్ వాహనాలు విధానం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు, ఇళ్ల నిర్మాణాలకు కోసం ఆర్థిక సహాయం, FCI దొడ్డు బియ్యం కొనుగోలు, పట్టణ స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలు ఇవాళ శాసనమండలిలో చర్చకు రానున్నాయి. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత స్వల్పకాలిక చర్చలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పై చర్చించనున్నారు. అంతేకాదు… ద ఇండియన్ స్టాంపు బిల్ 2021 కి (తెలంగాణ సవరణ) బిల్లును.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి.. చర్చించి ఆమోదానికి పెట్టనున్నారు.

ఇది కూడా చదవండి: ఊరికి ఒక పంచాయతీ.. గ్రామానికి రూ.5 లక్షల ఆదాయం: సీఎం

Advertisement

తాజా వార్తలు

Advertisement