Tuesday, April 23, 2024

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్

ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారు? ఎక్కడికి తీసుకెళ్లారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. రాజధాని భూముల వ్యవహారంలోనే ఆయనను అరెస్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. నరేంద్ర అరెస్ట్‌పై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తున్నారు. కాగా నరేంద్ర అరెస్ట్‌తో చింతలపూడిలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement