Tuesday, April 16, 2024

తెలుగు జాతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన మా నాన్నే సూప‌ర్ స్టార్ – నారా లోకేష్

నేడు టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా త‌న తండ్రికి బ‌ర్త్ డే విషెష్ చెప్పారు నారా లోకేష్..మా నాన్న సూప‌ర్ స్టార్..ఆయ‌న అందరి థైర్యం అని ట్వీట్ చేశారు..జన్మనిచ్చేవారే కాకుండా చదువు చెప్పేవారు, అన్నం పెట్టిన వారు, భయాన్ని పోగొట్టేవారు కూడా తండ్రితో సమానం అని చాణక్యుడు చెప్పార‌న్నారు.ఆ ప్రకారంగా చూస్తే ఆయన దార్శనిక పాలన ద్వారా ఎంతో మంది పేదలు కూడా ఉన్నత చదువులు చదవగలిగారని.. లక్షల ఉద్యోగాలిచ్చి కోట్లాదిమందికి అన్నదాత అయ్యారని స్పష్టం చేశారు. ఇక తెలుగువారికి ఆయనంటే ఒక భరోసా అని…లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యం అని కొనియాడారు. ఈ రకంగా కోట్లాది మందికి తండ్రి అయ్యారు ఆయన… సొంత కుటుంబం కోసం కాకుండా, తెలుగు జాతినే కుటుంబం చేసుకుని, ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్ స్టార్… ఆయనే మా నాన్న చంద్రబాబు గారు అంటూ ట్వీట్‌ చేశారు నారా లోకేష్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement