Monday, April 15, 2024

చంద్ర‌బాబుని ఫోన్ లో ప‌రామ‌ర్శించిన ర‌జ‌నీకాంత్..

ఏపీ అసెంబ్లీలో టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడికి జ‌రిగిన అవ‌మానం ప‌ట్ల స్పందించారు త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.. చంద్రబాబునాయుడికి ఫోన్ చేసి పరామర్శించారు ర‌జ‌నీకాంత్. అసెంబ్లీలో చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగతంగా దూషించడంపై రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. కాగా, చంద్రబాబు భార్యను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు పాల్పడడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు కుటుంబానికి అండగా నిలుస్తున్న పలువురు జాతీయ నేతలు ఏపీ రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement