Wednesday, April 24, 2024

Target India: హిందూ మహాసముద్రంలో చైనా మిషన్‌.. వినియోగంలోకి జిబౌటి నౌకాశ్రయం

ఆఫ్రికాలోని జిబౌటీలో నిర్మించిన నౌకాస్థావరం నుంచి చైనా కార్యకలాపాలు ప్రారంభించింది. హిందూ మహాసముద్రంలో బీజింగ్‌కు ఈ పోర్టు వ్యూహాత్మకమైనది. 590 మిలియన్‌ డాలర్ల వ్యయంతో 2016లో దీని నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పుడు పూర్తిగా పనిచేస్తోందనిస హిందూ మహాసముద్ర ప్రాంతంలో మోహరించిన చైనా యుద్ధనౌకలకు మద్దతు ఇస్తుందని ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. హెలికాప్టర్‌ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే చైనీస్‌ యుజా-వోక్టాస్‌ ల్యాండింగ్‌ షిప్‌ (071) ఆప్రాన్‌ సమీపంలో ఉన్న 320 మీటర్ల పొడవైన బెర్తింగ్‌ వద్ద నిలిపివుంచినట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించింది. చాంగ్‌బాయి షాన్‌గా గుర్తించబడిన ఈ ఓడ బరువు 25,000 టన్నులు. ఇది 800 మంది సైనికులు, వాహనాలు, ఎయిర్‌ కుషన్డ్‌ ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌, హెలికాప్టర్‌ల కలయికతో రూపొందించబడింది. ఈ ఏడాది హిందూ మహాసముద్ర జలాల్లోకి ప్రవేశించినప్పుడు దానితో పాటు ఫ్రంట్‌లైన్‌ చైనా డిస్ట్రాయర్‌ కూడా ఉన్నట్లు భావిస్తున్నారు.

జిబౌటీలో చైనా స్థావరం దాని మొదటి విదేశీ సైనిక స్థావరం. ఇది గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌-ఎర్ర సముద్రం గార్డ్‌లను వేరుచేసే వ్యూహాత్మక బాబ్‌-ఎల్‌-మండేబ్‌ జలసంధిలో ఉంది. అత్యంత క్లిష్టమైన సూయజ్‌ కెనాల్‌అంతర్జాతీయ వాణిజ్య మార్గాలలో ఇదొకటి. జిబౌటీ స్థావరం ”దాదాపు మధ్యయుగానికి చెందిన రక్షణ పొరలతో, ఆధునిక కాలపు వలస కోటలాగా, పటిష్టమైన రీతిలో నిర్మించబడింది. ఇది ప్రత్యక్ష దాడిని తట్టుకునేలా స్పష్టంగా రూపొందించ బడింది,” అని కోవర్ట్‌ షోర్స్‌కు చెందిన నేవల్‌ అనలిస్ట్ హెచ్‌ఐ సుట్టన్‌ చెప్పారు.

టైప్‌-071 ల్యాండింగ్‌ షిప్‌ చాలా పెద్దది. అనేక ట్యాంకులు, ట్రక్కులు, హోవర్‌ క్రాప్ట్‌లను కూడా తీసుకెళ్లగలదని సుట్టన్‌ చెప్పారు. వైస్‌ అడ్మిరల్‌ శేఖర్‌ సిన్హా (రిటైర్డ్‌) మాట్లాడుతూ, ”మరిన్ని నిర్మాణ పనులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ బేస్‌ పూర్తిగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ”వారు బ్రేక్‌వాటర్‌కు రెండు వైపులా ఓడలను సానుకూలంగా డాక్‌ చేయగలరు. జెట్టీ వెడల్పు ఇరుకైనప్పటికీ, అది చైనీస్ హెలికాప్టర్‌ క్యారియర్‌ను తీసుకునేంత పెద్దది” అని వివరించారు.

బీజింగ్‌ సాగరవ్యూహంతో ముప్పే!
బాలిస్టిక్‌ క్షిపణి ట్రాకింగ్‌ నౌక యువాన్‌ వాంగ్‌ 5ని శ్రీలంక నౌకాశ్రయంలోని హంబన్‌టోటాలో చైనా డాక్‌ చేసిన సమయంలో జిబౌటిలో పూర్తిగా పనిచేసే స్థావరం చిత్రాలు వెలుగులోకి వచ్చాయి.”బలమైన ట్రాకింగ్‌, సెన్సింగ్‌ – కమ్యూనికేషన్‌ రిలే సిస్టమ్‌తో యువాన్‌ వాంగ్‌ 5 ఖచ్చితంగా విదేశీ ఉపగ్రహాలు, వైమానిక ఆస్తులు, క్షిపణి వ్యవస్థలను గుర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ఇంటికి దూరంగా ఉన్న చైనీస్‌ మిలిటరీ మిషన్‌లకు మద్దతు ఇవ్వడానికి నౌకను అనుమతిస్తుంది” అని సీనియర్‌ పరిశోధకుడు డామియన్‌ సైమన్‌ చెప్పారు.

‘‘హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఓడ ఉండటం వల్ల చైనా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న అంతరిక్ష సంఘటనలను పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది, అదే సమయంలో జిబౌటీలో మో#హరింపులు, ఆఫ్రికాలో శాంతి పరిరక్షక దళాలు వంటి దాని విదేశీ స్థావరాలు, భూ ఆస్తులకు విస్తరించిన రియల్‌ టైమ్‌ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ను అందిస్తుంది. యాంటీ పైరసీ సముద్ర మిషన్లు చేపట్టడానికి వీలు కల్పిస్తుంది. భారత్‌కు సంబంధించి కీలకమైన శాటిలైట్‌ ఆస్తులను చైనా నేరుగా ట్రాక్‌ చేసే అవకాశం ఉందని డామియన్‌ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement