Friday, April 19, 2024

జైలు నుండి విడుద‌ల‌యిన ఇరాన్ న‌టి.. త‌ర‌నేహ్ అలిద‌స్తీ

ఎట్ట‌కేల‌కు జైలు నుండి విడుద‌ల‌యింది ఇరాన్ న‌టి త‌ర‌నేహ్ అలిద‌స్తీ. హిజాబ్ కి వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలిపినందుకు ఈమెని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉధృతంగా ఆదోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. గత డిసెంబర్‌లో నటి అలిదస్తీ కూడా ఆందోళల్లో పాల్గొన్నారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అయితే 18 రోజుల తర్వాత ఆమెకు అధికారులు బెయిల్‌ మంజూరు చేశారు.

దీంతో సినీనటి జైలు నుంచి విడుదలైనట్లు ఆమె న్యాయవాది తెలిపారు.2016 ఆస్కార్ గెలుపొందిన ‘ది సేల్స్‌మ్యాన్’ సినిమాలో అలిదస్తీ నటించారు. పలు టీవీ షోలలో కూడా కనిపించారు. గతంలో ఇరాన్‌ సినీ పరిశ్రమలో జరిగిన మీటూ ఉద్యమంలో అలిదస్తీ పాల్గొన్నారు. ఆమెను జైలు నుంచి విడుదల చేయాలని ప్రపంచ వ్యాప్తంగా 600 మంది నటీనటులు బహిరంగ లేఖపై సంతకాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement