Saturday, January 29, 2022

Tollywood: ఇండస్ట్రీలో కుల ప్రస్తావన లేదు.. దమ్ముంటే చర్చకు రండి: వైసీపీకి తమ్మారెడ్డి సవాల్

టాలీవుడ్ పై వైసీపీ నేతల చేసిన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ వైసీపీ నేతలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. కొత్త సినిమాలు ఆగిపోవడానికి రేట్లు కారణం కాదని, కోవిడ్ పరిస్థితుల వల్లే సినిమాలు ఆగాయి తమ్మారెడ్డి స్పష్టం చేశారు. సినిమాలో దమ్ముంటే ప్రజలు చూస్తారని అన్నారు. టికెట్ ధరకు, రెవెన్యుకు సంబంధం లేదన్నారు. సినీ ఇండస్ట్రీలో కులం గురించి ప్రస్తావన లేదని చెప్పారు. సినిమా వాళ్లంటే చిన్నచూపుతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

సినీ పరిశ్రమను నిందిస్తున్న నాయకులు తలదించుకోవాలని ఆయన అన్నారు. కుల ప్రస్తావన లేకుండా ఉపాధి కల్పించేది సినీ పరిశ్రమే అని చెప్పారు. సామాజిక వర్గాల పేరుతో రాద్ధాంతం ఎందుకు? అని ప్రశ్నించారు. మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా?: తమ్మారెడ్డి సవాల్ విసిరారు. మీరు వచ్చినప్పుడు మీ ఆస్తులెంత? ఇప్పుడెంత?: అని నిలదీశారు. రూ.కోట్లు పెట్టి నాయకులను ఎన్నుకుంటున్నారని తమ్మారెడ్డి ఆరోపించారు. మీరు రూపాయి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. సినీ పరిశ్రమ అంటే నిర్మాతల మండలి అని, రాజకీయ నేతలు ఇంకెప్పుడు బెదిరింపులకు పాల్పడవద్దు అని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement