Friday, April 19, 2024

త‌మిళ‌నాడు..శ్రీలంక తీరంలో అల్ప‌పీడ‌నం.. 11జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్

తమిళనాడు, శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగపట్టణంలో పాఠశాలలు, కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. తిరువారూరులో పాఠశాలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 11 జిల్లాలకు వాతావరణశాఖ యెల్లో అలెర్ట్ జారీ చేసింది. వాయవ్య భారతదేశంలో ఈ నెలలో సాధారణ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. రానున్న రోజుల్లో చలిగాలుల ప్రభావం తగ్గుతుందని పేర్కొంది.త‌మిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తంజావూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండడంతో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. నగరంలో నేడు గరిష్ఠంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇంతకుముందు నాగపట్టణం, తిరువారూర్ జిల్లాలు సహా రాష్ట్రంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement