Thursday, March 28, 2024

ధ‌నుశ్ చిత్రం టైటిల్ ‘సార్’

త‌మిళ స్టార్ హీరో ధ‌నుశ్ తెలుగులో రెండు చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్ లో ఒక చిత్రం, మ‌రో ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. కాగా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే చిత్రానికి టైటిల్ ని ఖ‌రారు చేశారు. తెలుగులో ‘సార్’ అనీ .. తమిళంలో ‘వాతి’ అని ఈ సినిమాకి నామకరణం చేశారు.తాజాగా టైటిల్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. నాగవంశీ – సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ‘మిస్టర్ మజ్ను’ .. ‘రంగ్ దే’ వంటి రెండు ఫ్లాపులున్న వెంకీ అట్లూరికి ధనుశ్ ఛాన్స్ ఇవ్వడం విశేషమే. ఇక త‌మిళ చిత్రాల‌తో ధ‌నుశ్ బిజీగా ఉన్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement