Wednesday, April 24, 2024

Movie Update: తమన్నా కొత్త మూవీ బబ్లీ బౌన్సర్​.. ఆకట్టుకుంటున్న ట్రైలర్​!

తమన్నా అంటే ఇన్నాళ్లూ ఓ గ్లామర్‌ క్వీన్‌గా అభిమానులకు తెలుసు. ఈ మిల్కీ బ్యూటీ అందానికి ఫిదా కాని ప్రేక్షకులు లేరు. అయితే తొలిసారి ఇప్పుడామె ఓ సరికొత్త అవతారంలో కనిపించబోతోంది. బబ్లీ బౌన్సర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆమె.. ఓ బబ్లీ పంజాబీ గర్ల్‌గా, ఓ బౌన్సర్‌గా కనిపించనుండటం విశేషం. తాజాగా ఇవ్వాలే (సోమవారం) ఈ మూవీ ట్రైలర్‌ రిలీజైంది. ఇందులో తమన్నా క్యారెక్టర్‌ నవ్వులు పూయిస్తోంది.

సొంతూళ్లో మగ పెహల్వాన్‌ల మధ్య తాను కూడా పెహల్వాన్‌లా మారిన ఆమె.. ఆ తర్వాత ఓ బౌన్సర్‌గా ఎలా మారిందన్నదే ఈ మూవీ స్టోరీ. బౌన్సర్ల ఊరిగా పేరున్న ఫతేపూర్ బేరీ అనే గ్రామంలో పుట్టి.. అక్కడి ప్రతి మగపిల్లవాడిలాగే తాను కూడా ఫిజిక్‌ డెవలప్‌ చేసుకొని పెహల్వాన్‌లా మారిన బబ్లీ అనే అమ్మాయి స్టోరీ ఇది. ఈ సినిమాలో తమన్నా బబ్లీగా నటించింది. ఆమె డైలాగ్‌ డెలివరీ పూర్తి భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.

తన ఊరి నుంచి ఉద్యోగం కోసం ఢిల్లీ చేరిన ఆమె.. అక్కడ ఓ బౌన్సర్‌ ఉద్యోగంలో సెటిలవుతుంది. ఆ తర్వాత ఆమెకు ఎదురైన సవాళ్లేంటన్నదే ఇక్కడ ఆసక్తికరం. ఈ మూవీ నేరుగా హాట్‌స్టార్‌ ఓటీటీలోనే రిలీజ్‌ కాబోతోంది. సెప్టెంబర్ 23న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మొత్తం తమన్నా షోనే కాబోతోందని ట్రైలర్‌ చూస్తేనే స్పష్టమవుతోంది. బబ్లీ బౌన్సర్‌ ట్రైలర్‌ను తమన్నా తన ట్విటర్‌ అకౌంట్‌లోనూ పోస్ట్‌ చేసింది. “అసోలా ఫతేపూర్‌కు చెందిన ఈ అమ్మాయి బౌన్సర్‌గిరి చేయడానికి ఇక్కడికి వచ్చింది. బబ్లీ బౌన్సర్‌ను కలవడానికి రెడీగా ఉండండి. ట్రైలర్‌ వచ్చేసింది” అని తమన్నా క్యాప్షన్‌ ఉంచింది. ఈ మూవీలో సౌరబ్‌ శుక్లా, అభిషేక్‌ బజాజ్‌, సాహిల్‌ వైద్‌ కూడా నటించారు. హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ ఈ మూవీ స్ట్రీమ్‌ కానుంది.

https://twitter.com/Mr_rickdalton/status/1494549027249180677

Advertisement

తాజా వార్తలు

Advertisement