Wednesday, March 27, 2024

T20: సెమీస్ లో నిలవాలంటే గెలవాల్సిందే.. రెండు జ‌ట్ల‌కూ బిగ్ చాలెంజ్‌

West Indies vs South Africa: ఈ రోజు దుబాయ్ లో వెస్టిండీస్‌, సౌథాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య మ‌రో ర‌స‌వ‌త్త పోరు జ‌ర‌గ‌నుది. ఈనికి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఇప్పటికే గ్రూప్ 1 లో వెస్టిండిస్ తన మొదటి మ్యాచ్ ని ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిపోగా, దక్షిణాఫ్రికా టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఓటమితో మొదలుపెట్టింది.

తాజాగా గ్రూప్ 1 నుండి సెమీస్ కి చేరాలంటే ఇరు జట్లకు ఈరోజు మ్యాచ్ విజయం త‌ప్ప‌నిస‌రి కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన వెస్టిండిస్ పేలవ బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి నుండి తేరుకొని ఈ రోజు దక్షిణాఫ్రికాతో జరగబోయే మ్యాచ్ లో తమ సత్తాచాటి గెలుపొందాలని పట్టుదలతో ఉంది..

దక్షిణాఫ్రికా జట్టు మాత్రం ఓపెనర్ క్వింటన్ డికాక్, మిడిల్ ఆర్డర్ కేశవ్ మహారాజ్ బ్యాటింగ్ పైనే ఆధారపడి ఉంది. ఇక ఇప్పటివరకు దక్షిణాఫ్రికా – వెస్టిండిస్ మధ్య 15 టీ20 మ్యాచ్ లు జరగగా అందులో దక్షిణాఫ్రికా 9, వెస్టిండిస్ 6 మ్యాచ్ లలో గెలుపొందాయి.

నేడు జరగబోయే ఇరు జట్ల తుది వివరాలు..
దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా, క్వింటన్ డికాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, కగిసో రబడా, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ

వెస్టిండిస్ జట్టు: లెండిల్ సిమన్స్, ఎవిన్ లూయిస్, క్రిస్ గేల్, రోస్టన్ చేజ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్ , కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, అకేల్ హోసేన్, ఒబెడ్ మెక్‌కాయ్, రవి రాంపాల్

Advertisement

తాజా వార్తలు

Advertisement